సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు గర్హనీయం.
జర్నలిస్టుల నిరసనకు సంఘీభావం.
.సత్తుపల్లి, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
పత్రికా స్వేచ్ఛను అణచివేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు పనిచేయడం తీవ్రంగా ఖండనీయమని జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా అక్రమ కేసులు నమోదు చేయడం గర్హనీయం అని సత్తుపల్లిలో జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు.
శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే–టీజేఎఫ్ ప్రతినిధి తోట కిరణ్, టీయూడబ్ల్యూజేఎఫ్ చినేని బాలకృష్ణ, టీయూడబ్ల్యూజే–ఐజేయూ ప్రతినిధి తడికమళ్ల దేవా మాట్లాడుతూ, జర్నలిస్టులపై దమనకాండ ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు. పత్రికా స్వేచ్ఛ రక్షణ కోసం జర్నలిస్టులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నారావు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు దండు ఆదినారాయణ, సిపిఎం పట్టణ కార్యదర్శి సర్వేశ్వరరావు, మాస్ లైన్ బాధ్యులు అమర్లపూడి శరత్, మసీదు కమిటీ కార్యదర్శి ఎండీ కమల్ పాషా, మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి మల్లికార్జున్, ఎమ్మార్పీఎస్ నాయకుడు శ్రీనివాసరావు, లయన్స్ అధ్యక్షుడు రవి, వడ్డెర సంఘం నాయకుడు జమలయ్య, లంబాడి హక్కుల సంఘం ప్రతినిధి నందు నాయక్ తదితరులు సంఘీభావం తెలిపారు.
ఈ నిరసనలో జర్నలిస్టులు ఎండీ షైబుద్దీన్, భీమిశెట్టి రఘురామారావు, ఎస్కే ఖాదర్ బాబా, బి.వి. రామారావు, జిడిమళ్ల శ్రీనివాసరావు, కొవ్వూరు సాంబశివరావు, బొర్ర కోటేశ్వరరావు, గోపరాజు గోపి, నర్రా అరుణ్, రావిశెట్టి లక్ష్మణరావు, శ్రీకాంత్, ఐ. శ్రీనివాసరావు, సతీష్, ఎస్కే మీరా, బాజీ, సురేష్, మహా శ్రీనివాస్, తడికమళ్ల అప్పారావు, గురవయ్య, కొత్తపల్లి సుధాకర్, చీపు గంగాధర్, వబిలిశెట్టి రామారావు, కాకర్ల జగన్, ఎస్కే మునీర్, బల్లెం చిరంజీవి, లింగగిరి రామకృష్ణ, జంగం కిరణ్, అశోక్, ఎండీ మేరాజ్, బాలకృష్ణ (టీయూడబ్ల్యూజేఎఫ్) తదితరులు పాల్గొన్నారు.


Comments