కాజీపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

కాజీపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

 కాజీపేట తెలంగాణ ముచ్చట్లు

 భారతదేశ 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాజీపేటలో  కార్యక్రమాలను పలువురు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో కాజీపేట లోని సికింద్రాబాద్ డివిజన్ ట్రైనింగ్ సెంటర్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ డివిజన్ ఆర్గనైజింగ్ కమిషనర్ బక్క శోభారాణి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ ఎర్ర ఏలియా, కొంపల్లి సునీత పాల్గొని జాతీయ పతాకాన్ని తోపాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. డివిజన్ ఆర్గనైజింగ్ కమిషనర్ బక్క శోభారాణి మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినీ విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు   ఆర్గనైజేషన్ ను మరింత బలోపేతం చేయాలని ఆమె కోరారు. ప్రజల్లో మత్తుపదార్థాలపై అవగాహన కల్పించి ఆపద కాలంలో రక్షణ సహాయక చర్యలనుఅందిచాలన్నారు . ఈ కార్యక్రమంలో పొన్నాల సురేష్ బాబు, సత్రం గోపి, డి. సంపత్ కుమార్ ,విద్యాసాగర్, శ్రీధర్ , రాకేష్  మదన్ మోహన్ , వంగాల శశికాంత్, సాజిద బేగం, మంజుల వాణి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ ఎడిట్ సొసైటీ లిమిటెడ్ కాజీపేట కార్యాలయంలో డైరెక్టర్ దేవలపల్లి రాఘవేందర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన త్యాగమూర్తులైన కోట్ల ప్రజల ఆత్మ శాంతి చేకూర్చాలని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డెలిగేట్స్ రాజేందర్, శ్రీనివాస్ ,రాజు, ఓఎస్.ఎస్ రానా ,ప్రతాప్ వినయ్ కుమార్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .