ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వేను పూర్తి చేయాలి

జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సత్య శారద దేవి 

ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వేను పూర్తి చేయాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

ఈ నెలాఖరు లోగా ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వేను పూర్తి చేయాలని ఇంచార్జ్  జిల్లా కలెక్టర్  సత్య శారద దేవి అధికారులకు ఆదేశించారు.శుక్రవారం వరంగల్ మున్సిపల్ పరిధి లోని క్రిస్టియన్ కాలనీ, (లేబర్ కాలనీ) హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం, అక్కంపేట    గ్రామాలలో సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమి ఉండి గృహ నిర్మాణం కోసం సమగ్ర సర్వే ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా సర్వే నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాల  పనితీరును, లబ్ధిదారుల వివరాలను పొందుపరచు తీరును సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా ఇంచార్జ్  జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు గృహ నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డును పరిశీలించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. రేషన్ కార్డు లో తప్పనిసరిగా లబ్ధిదారుల పేరును ఉండేలా చూడాలని తెలిపారు. అదేవిధంగా సర్వేలో పూర్తిగాసేకరించినలబ్ధిదారుల వివరాలను యాప్ ద్వారా నమోదు చేయాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే త్వరితగతిన పూర్తయ్యేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని సర్వే అధికారులను ఆదేశించారు.  నమోదు ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ  జిల్లాల
 2 బిహెచ్కెనోడల్ అధికారు లు రాజేందర్, జి రామ్ రెడ్డి , తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి , మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఆర్ ఐ సునీల్, ఆర్ ఓ శ్రీనివాస్, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.IMG-20241220-WA0197

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .