విద్యార్థి దశ జీవితంలో కీలకం
పెద్దమందడి ఎస్సై శివకుమార్
పెద్దమందడి,సెప్టెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
మనిషి జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమని పెద్దమందడి ఎస్సై శివకుమార్ అన్నారు.
శుక్రవారం పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చెప్పులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీసు అధికారి రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బూట్లను పంపిణీ చేసి, వారితో కలసి సమయాన్ని గడిపారు.
ఎస్సై శివకుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ –
“విద్యార్థి దశే మనిషి జీవితానికి పునాది. ఈ కాలంలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వింటూ, క్రమశిక్షణతో చదివితే మీరు కోరుకున్న స్థానాలకు చేరుకోగలుగుతారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, సమయాన్ని వృథా చేయకుండా కృషి చేయాలని” సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ –“ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు మంచి పుస్తకాలను చదివి, మంచి స్నేహితులను ఎంచుకుంటే జీవితంలో విజయాలు సాధ్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా మారాలని, భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని” పిలుపునిచ్చారు. అనంతరం ఎస్ఐ శివకుమార్ ను జిల్లా ఎస్పీ శాలువతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..jpeg)


Comments