కాచిగూడ - అనకాపల్లి రైలుకు మల్కాజ్ గిరిలో ఘన స్వాగతం
మల్కాజ్‌గిరి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
మహాత్మా గాంధీ జయంతి, దసరా పండుగ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే 59వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 07055 కాచిగూడ - అనకాపల్లి పండుగ ప్రత్యేక రైలుకు మల్కాజ్ గిరి ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ రైలు ప్రతి గురువారం సాయంత్రం 4:50 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరి, మల్కాజ్ గిరి వద్ద సాయంత్రం 5:10 - 5:12 గంటల మధ్య ఆగి, మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి సాయంత్రం 5:35 గంటలకు బయలుదేరి, మల్కాజ్ గిరి వద్ద 6:43 - 6:45 ఆగి, రాత్రి 9:00 గంటలకు కాచిగూడకు చేరుతుంది అని రైలు ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఏ.వి. స్వామి, కరీమా, పి. భరద్వాజ్, వహీదా, ధనుంజయ్, హసీనా, రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొని, మల్కాజ్ గిరిలో హల్ట్ సౌకర్యం కల్పించినందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ మరియు ఇతర అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.అదే సమయంలో, మల్కాజ్ గిరి వద్ద రాయలసీమ ఎక్స్‌ప్రెస్ కూడా నిలపాలని పలువురు ప్రయాణికులు కోరారు.


Comments