మృతుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చేసిన కడియం శ్రీహరి

మృతుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చేసిన కడియం శ్రీహరి

జఫర్గడ్‌ (ఆగస్టు 23) తెలంగాణ ముచ్చట్లు
స్టేషన్‌ ఘనపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం పర్యటనలో భాగంగా జఫర్గడ్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తీగారం గ్రామానికి చెందిన జిట్టబోయిన మల్లయ్య  ఇటీవల మృతి చెందగా, ఆయన ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

తదుపరి తమ్మడపల్లి (జీ) గ్రామంలో ఎన్టీవీ రిపోర్టర్ కొత్త రంజిత్ తండ్రి కొత్త వెంకటేశ్వర్లు  అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా, వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని, డాక్టర్లు సూచించినవిధంగా మందులు వేసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. WhatsApp Image 2025-08-22 at 6.25.10 PM

అదే గ్రామానికి చెందిన వేల్పుల సోమ నర్సమ్మ, గాజుల సంపత్, సోన్నాయిల ఎల్లయ్య, పందిబోయిన సోమయ్య మరణించగా, వారి కుటుంబాలను కూడా పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, కడియం శ్రీహరి  సామాజిక సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .