కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులు పేదలకు వరం

-ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులు పేదలకు వరం

స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:

జఫర్గడ్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 34 మంది లబ్ధిదారులకు 10.46 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు, 31 మంది ఆడబిడ్డలకు 31.03 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మి వంటి కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. తన ఎమ్మెల్యే పదవీకాలం మొదటి సంవత్సరంలోనే నియోజకవర్గానికి రూ. 750 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేయించానని తెలిపారు.

సిసి రోడ్లకు శంకుస్థాపన
జఫర్గడ్ మండలంలో రూ. 50 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అదనంగా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను నిర్మించేందుకు త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
పేదలకు సొంతింటి కల నెరవేర్చడంలో ప్రభుత్వ కృషిని వివరిస్తూ, మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇండ్ల మంజూరు చేపట్టామని, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లతో పాటు అదనంగా మరో 2,500 ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.


WhatsApp Image 2024-12-07 at 9.58.33 PM

కాంగ్రెస్ ఘనతపై హర్షం..కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ద్వారా దేశంలోనే అత్యధికంగా 25 లక్షల మంది రైతుల కోసం రూ. 21 కోట్ల రుణమాఫీని అమలు చేసిందని, రాష్ట్ర అభివృద్ధికి పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌పై విమర్శలు
బీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ల పాలనలో నిరుద్యోగులను విస్మరించిందని, వారి హామీలను అమలు చేయడంలో విఫలమైందని కడియం శ్రీహరి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .