కేయూ కామన్ మెస్‌ను సందర్శించిన ప్రజాప్రతినిధులు
Views: 18
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే మరియు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కలిసి కాకతీయ విశ్వవిద్యాలయంలోని కామన్ మెస్‌ను శనివారం సందర్శించారు.
ఈ సంధర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, మెస్‌లోని వసతులు, ఆహార నాణ్యత, శుభ్రత వంటి అంశాలను సమీక్షించారు. విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ, మెరుగైన వసతుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్శన విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో ముందడుగుగా నిలిచింది.విద్యార్థుల అవసరాలు, మెస్ నిర్వహణలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించడం ద్వారా ప్రజాప్రతినిధులు తమ ప్రజాసేవా దృక్పథాన్ని మరోసారి చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,కేయూ ఉద్యోగులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments