1 కోటి 10 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే బండారి 

1 కోటి 10 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే బండారి 

చిల్కానగర్, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. మొత్తం రూ.1 కోటి 10 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.బీరప్పగడ్డ మస్జిద్ ఎదుట ప్రాంతంలోని పలు వీధుల్లో రూ.50 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి, ఈస్ట్ కళ్యాణపురి–బ్యాంక్ కాలనీ ఉద్యానవనాల్లో రూ.20 లక్షల వ్యయంతో పిల్లల ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్, వాచ్మెన్ రూమ్, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర పనులకు శంకుస్థాపన చేశారు. కళ్యాణపురిలో కొత్త వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు పనులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే అంబేద్కర్ స్టాచ్యూ వెనుక నుండి డాక్టర్ అశోక్ క్లినిక్ వరకు రూ.40 లక్షలతో సిసి రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి మాట్లాడుతూ
“చిల్కానగర్ డివిజన్ అభివృద్ధిలో నంబర్ వన్ డివిజన్‌గా ముందుకు సాగుతోంది. ఎలక్షన్‌లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చుతున్నాం” అని తెలిపారు.కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ“చిల్కానగర్ డివిజన్ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.100 కోట్లకు పైగా నిధులు సేకరించగలిగాం. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బిఆర్ఎస్ నాయకులు, కాలనీ అసోసియేషన్ పదాధికారులు, మహిళా నాయకులు, బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .