సర్పంచ్ అభ్యర్థి మధిర మంజుల శ్రీశైలం తరఫున ఎమ్మెల్యే ప్రచారం 

సర్పంచ్ అభ్యర్థి మధిర మంజుల శ్రీశైలం తరఫున ఎమ్మెల్యే ప్రచారం 

పెద్దమందడి,డిసెంబర్07(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మధిర మంజుల శ్రీశైలం తరఫున ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రసంగంలో ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధి అంశాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా తాగునీటి సమస్యలు, అంతర్గత రహదారుల మరమ్మతులు, మురుగు నీటి పారుదల వ్యవస్థ, విద్యా మరియు ఆరోగ్య సౌకర్యాల విస్తరణ వంటి అంశాలను ప్రస్తావించారు.అభ్యర్థి గ్రామస్తులతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో సక్రమంగా వ్యవహరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పామిరెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి మధిర మంజుల శ్రీశైలం ను బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .