వరద నీరు ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చర్యలు

వరద నీరు ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చర్యలు

మల్కాజిగిరి, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

ఈవాళ భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మల్కాజిగిరి సర్కిల్, ఓల్డ్ నేరేడ్, మెట్ దర్గా ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలో వరద నీరు ప్రవహిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో స్థానిక కాలనీవాసుల పిలుపుమేరకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ తో కలిస వరద ప్రాంతాన్ని గురువారం సందర్శించారు.
సందర్శన సమయంలో ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ వాటర్ వర్క్స్, హైడ్రా, జిహెచ్ఎంసి అధికారులను ప్రదేశానికి రప్పించి సమస్య తీవ్రతను పరిశీలించారు. స్థానికుల ఇబ్బందులను అర్థం చేసుకుని తక్షణమే పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ నవీన్, హైడ్రా విభాగం అధికారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకన్న, స్థానికులు పంజా శ్రీకాంత్ యాదవ్, చేరన్ యాదవ్, మణి యాదవ్, అభిషేక్, రఘు, యశ్వంత్, హేమంత్, నిశాంత్, చింటూ, శ్రీధర్, మహేష్, అరవింద్, ఇంద్ర, దుర్గమ్మ, మంజుల, లలిత తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,"ప్రజల సౌకర్యం మా ప్రధాన లక్ష్యం. వరద నీటి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు అన్ని సంబంధిత విభాగాలతో సమన్వయం కొనసాగించాం," అని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .