2కె రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని,కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల భాగంగా హనుమకొండ జెఎన్‌ఎస్ స్టేడియంలో ఆదివారం 2కె రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య కలిసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఏడాది ప్రజా పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలు తొమ్మిది రోజులపాటు వివిధ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2కె రన్ ద్వారా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.డి.ఓ. అశోక్, డి.బ్ల్యూ.ఓ. జయంతి, ఇతర క్రీడాధికారులు, పాల్గొన్నారు.


Comments