సత్తుపల్లి లో అక్షరబ్యాసం, దసరా పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి.

సరస్వతి ఆలయంలో 200 మంది చిన్నారుల అక్షరబ్యాసం.

సత్తుపల్లి లో అక్షరబ్యాసం, దసరా పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి.

సత్తుపల్లి, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

దసరా నవరాత్రుల సందర్భంగా  సత్తుపల్లి పట్టణంలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరబ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మవారి స్వరస్వతి అవతారం మూల నక్షత్రం సందర్భంగా సుమారు 200 మంది చిన్నారులకు వేదమంత్రాలతో అక్షరబ్యాసం జరిపి, పలక, బలపం తో అక్షరాలు రాయించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు.

అక్షరబ్యాసం కార్యక్రమంలో మట్టా దయానంద్ వ్యక్తిగత సహాయకుడు బత్తుల భరత్ కుమార్ కుమారుడు, ఎమ్మెల్యే డ్రైవర్ వంగల ప్రకాష్ గౌడ్ కుమారుడు, సత్తుపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మిశెట్టి గణేష్ కుమారుడు పాల్గొని ఆశీర్వాదం పొందారు.

ఇక పట్టణంలోని వెంగలరావు కాలనీ, జవహర్ నగర్ కృష్ణ మందిరం, సింగరేణి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణలోనూ ఎమ్మెల్యే రాగమయి, దయానంద్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు.

ఈ సందర్భంగా ప్రజలకు దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


WhatsApp Image 2025-09-29 at 7.02.45 PMWhatsApp Image 2025-09-29 at 7.02.56 PM ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమఆనంద్, సింగరేణి అధికారులు, ఉద్యోగులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట సుజలా రాణి, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు కమల్ పాషా, పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా, యువజన నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .