కేంద్ర విమానయన శాఖ మంత్రిని కలిసిన ఎంపీ కడియం కావ్య
Views: 16
On
న్యూఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు:
మామునూరు విమానాశ్రయ పనులు త్వరితగతిన ప్రారంభం కావాలని కోరుతూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆమె మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. విమానాశ్రయం పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ....
• హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రూ. 4,000 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
• మాస్టర్ ప్లాన్, మెగా టెక్స్ టైల్ పార్కు భూసేకరణ, ఇళ్ల మంజూరు, అలాగే విమానాశ్రయం అభివృద్ధికి 205 కోట్లతో భూసేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు.
• భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రెండు సంవత్సరాలలో ఎయిర్‌పోర్ట్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందన:
మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై సానుకూలంగా స్పందించిన మంత్రి, రెండు సంవత్సరాలలో విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ చర్చలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఎంపీ కడియం కావ్య, కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు మరింత ఊతమివ్వనుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments