వ్యవసాయ కార్మికుల అభివృద్ధికి సమగ్ర చట్టాలు చేయాలి.
పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలి...
మెరుగు సత్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. యర్రా శ్రీనివాసరావు రాష్ట్ర కమిటీ సభ్యులు...
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 7, తెలంగాణ ముచ్చట్లు;
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై కేంద్రీకరించాలి ప్రత్యేక నిధులు కేటాయించి వ్యవసాయ కూలీలకు నిరంతరం పని కల్పించాలి వ్యవసాయ కూలీల అభివృద్ధికి సమగ్ర చట్టాలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన ఆరు గ్యారెంటీ లను సంపూర్ణంగా అమలు చేయాలి దానిలో భాగంగానే వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 అందిస్తాం అన్న వాగ్దానం అమలు చేయాలని పట్టణ ప్రాంతాలలో ఉపాధి పని కల్పిస్తూ సంవత్సరానికి 150 రోజులు పని కల్పిస్తూ రోజుకి 400 రూపాయలు వేతనం ఇస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సుందరయ్య భవనాలు వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ అధ్యక్షులు ఎస్.కె ఇమామ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ అత్యంత నిరుపేదలైన వ్యవసాయ కూలీలు ఆర్థికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా వెనకబడి ఉంటున్నారని వ్యవసాయ పనులు సంవత్సరం మొత్తం దొరకకపోగా ఇతర గ్రామీణ పనులు లేకపోవడం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వాలు నిరుపేదలు చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి అనేక గ్రామాలను పట్టణాలలో కలుపుతూ గ్రామీణ ప్రాంతంలో దొరుకుతున్న ఉపాధి పని తీసివేయటం జరుగుతున్నది దీని ఫలితంగా వేలాది మందికి ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కొనుగోలు శక్తి క్షీణిస్తున్నది దీని ఫలితంగా ఆర్థిక సంక్షోభం వస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని సంవత్సరం పొడుగునా ఉపాధి పనులు కల్పించాలని ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు రేషన్ కార్డులు మంజూరు చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పింఛన్ల పెంపును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈనెల 10వ తేదీన ఖమ్మం అర్బన్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని . కోరారు ఇంకా ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం డివిజన్ కార్యదర్శి పడిగెల నాగేశ్వరరావు గద్దల రత్తమ్మ తీగల వెంకటేశ్వర్లు గద్దల పెంటయ్య ఎస్కే రహీం మొర్రి మేకల ప్రసాద్ వెంకట్ రాములు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments