పల్లె దవఖాన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.
వృద్ధురాలు ప్రైవేటు ఆసుపత్రి పాలు..?

మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:
రోగం వచ్చిందని పల్లె దవాఖానకు వెళితే మిడిమిడి జ్ఞానంతో వైద్య సిబ్బంది ఇచ్చిన మందులను వేసుకుంటే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న వైనం వెలుగు చూసింది వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎలకుర్తి గ్రామానికి చెందిన పట్లోళ్ల సంగమ్మ, 70 సంవత్సరాల అనే వృద్ధురాలు గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతూ సమీపంలోని పల్లె దవాఖాను ఆశ్రయించింది అక్కడున్న వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో గ్యాస్ ట్రబుల్ కు మందులకు బదులుగా బెంజిన్ హెక్సా క్లోరైడ్ మందు సీసాను ఇచ్చి తాగమని వృద్ధురాలికి చెప్పారట, పల్లె దవాఖాన వైద్య సిబ్బంది చెప్పినట్టుగానే. ఇచ్చిన మందు సీసాను తాగడంతో సంగమ్మ అనే వృద్ధురాలు వాంతులు విరోచనాలు చేసుకొని ఆసుపత్రిలో చేరింది. రెండు రోజులుగా మెదక్ లోని రష్ ఆసుపత్రిలో చికిత్స పొందింది ఎందుకుగాను సుమారు 30 వేల రూపాయల ఖర్చు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Comments