జీవితంలో ఎప్పుడు నిరుత్సాహ పడొద్దని, ఆశావాహ దృక్పధంతో ముందుకు సాగాలి
-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
జీవితంలో ఎప్పుడు నిరుత్సాహ పడొద్దని, ఆశావాహ దృక్పధంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం స్థానిక లెనిన్ నగర్ లోని బాలల సదనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. బాలసదనంలోని బాలికలు కలెక్టర్ కు పూలతో స్వాగతం పలికారు. ముఖాముఖిగా బాలికలతో ముచ్చటించిన కలెక్టర్, వారితో ఒక అన్నగా భావించి, ఏ ఏ సమస్యలు ఉన్నాయో చెప్పాలన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని, బాలికలతో వేడుకలు చేసుకున్నారు. బాలసదానంలోని బాలికలు ఈ సందర్భంగా కలెక్టర్ కు రాఖీలు కట్టారు. కలెక్టర్ బాలికలకు కొత్త బట్టలు, మిఠాయిలు అందించారు. బాలికలకు కావాల్సిన విద్యా సామాగ్రిని కలెక్టర్ పంపిణీ చేశారు. బాలసదానంలో తల్లిదండ్రులు లేక తల్లి/తండ్రి కోల్పోయిన బాలికలు 31 మంది వసతి పొందుతున్నట్లు కలెక్టర్ అన్నారు. అనాధలయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. దశరా సెలవుల్లో బాలికలను వండర్ లా, రామోజీ ఫిలిం సిటీకి విహారానికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చదువుతోనే సమాజంలో గౌరవం, స్థానం లభిస్తుందని అన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ బాలికలకు ఉద్భోదించారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, అధికారులు, తదితరులు ఉన్నారు.


Comments