పెద్దమందడి–ఖిల్లా ఘణపురం  అన్నదాతలకు కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్

ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెద్దమందడి–ఖిల్లా ఘణపురం  అన్నదాతలకు కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్

పెద్దమందడి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):

పెరుగుతున్న వ్యవసాయం, పంటల దిగుబడులు, అన్నదాతల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వనపర్తి నియోజకవర్గ పరిధిలో కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అభ్యర్థన మేరకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఖిల్లా ఘణపురం, పెద్దమందడి మండలాలకు సంబంధించి నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది (జీవో ఎంఎస్ నం. 121).
ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణంతో పెద్దమందడి, ఖిల్లా ఘణపురం మండలంలోని అన్నదాతల ఇబ్బందులు తీరనున్నాయి. త్వరలో రిజర్వేషన్ల ప్రాతిపదికన మార్కెట్ యార్డుకు సంబంధించిన కమిటీ ఏర్పాట్లు జరుగనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్మాణానికి సహకరించిన ఇంచార్జ్ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .