బిఎస్ విద్యార్థులకు నో ఎంట్రీ.!
పేద, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం.
సత్తుపల్లి, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
గత తొమ్మిది సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ పథకం కింద సత్తుపల్లి సీటు సంపాదించి పాఠశాలల్లో చేరుతూ వస్తున్నారు. కానీ ఈ నెల నుంచి వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
స్కూల్ యాజమాన్యం వివరాల ప్రకారం, గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వం చెల్లించవలసిన విద్యార్థుల ఫీజు అందకపోవడంతో పాఠశాల ఆర్థిక భారంతో నిదర్శన చేయలేకపోతోంది. ఫలితంగా ఈ ఏడాది 80 మంది పేద మరియు గిరిజన విద్యార్థులను తరగతి గదులకు అనుమతించలేమని తల్లిదండ్రులకు తెలిపారు.
యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఫీజు బకాయిల కారణంగా ఉపాధ్యాయుల జీతాలు చెల్లించడం కష్టంగా మారింది. గత మూడు సంవత్సరాలుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచి తాత్కాలికంగా విద్యార్థులను స్కూల్‌లో చేరవేసారు. కానీ ఈ సంవత్సరం ఆర్థిక భారాన్ని మోయలేకపోవడంతో తాము విద్యార్థులను తరగతి గదులకు అనుమతించలేమని తెలిపారు.
తల్లిదండ్రులు ఎన్ని సార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చినా, ఎటువంటి హామీ రాకపోవడం కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నది. అందువల్ల మండల విద్యాశాఖ అధికారిని ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచి తగిన విధంగా సహకరించాలని తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు.


Comments