ఆదర్శ కమ్యూనిస్టు పోటు ప్రసాద్.    

-సిపిఐ జాతీయ సమితి సభ్యులు-బాగం   

ఆదర్శ కమ్యూనిస్టు పోటు ప్రసాద్.    

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

అమరజీవి పోటు ప్రసాద్ ఎంతో ఆదర్శవంతమైన కమ్యూనిస్టు అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు హేమంతరావు అన్నారు గురువారం చింతకాని మండలం బస్వాపురం గ్రామంలో జరిగిన పోటు ప్రసాద్ సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చరిత్ర గల కుటుంబంలో పుట్టిన పోటు ప్రసాద్ ఖమ్మం జిల్లాకు వచ్చి విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, కార్మిక నేతగా ఎదిగి సిపిఐ జిల్లా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించాలని కొనియాడారు .వారి యావత్ కుటుంబం కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు ఈనెల 8న ఖమ్మంలో జరగనున్న పోటు ప్రసాద్ సంస్మరణ సభలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి   జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పగిడిపల్లి ఏసు ,జిల్లా సమితి సభ్యులు మార్గం శ్రీను, శాఖ కార్యదర్శి బద్దల నరసింహారావు , నాయకులు బుర్ర అంజయ్య ఆవుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .