జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లు ప్రారంభం

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హన్మకొండ,అక్టోబర్27(తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. 
వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 161 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ప్రస్తుతం 51 కొనుగోలు నడుస్తున్నాయని అన్నారు. మిగతా 110 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఐకెపి, పిఎసిఎస్ ల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో  సరిపోను గన్నీ సంచులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమశాతం కొలిచే మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ఇతర సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు.  వరి దాన్యంలో తేమ 17 శాతం కంటే తక్కువగా ఉండాలన్నారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 2389, కామన్ గ్రేడ్ కు రూ. 2369 ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సన్న రకం వరి దాన్యానికి ప్రభుత్వం రూ. 500 అదనంగా చెల్లిస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు సంబంధిత అంశాలపై కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. రైతులు వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై కంట్రోల్ రూమ్ నంబర్ 7330751364 ను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో మొక్కజొన్న కొనుగోలుకు ఐనవోలు, ఎల్కతుర్తి లో కేంద్రాలను ఏర్పాటు చేసామని, వేలేరు, కమలాపూర్ లోని వ్యవసాయ మార్కెట్, ధర్మసాగర్, వంగ పహాడ్ లలో త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మొక్కజొన్న లో  14% తేమ ఉన్న వాటికి క్వింటాకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు.  పత్తి కొనుగోలుకు జిల్లాలో 2025-26 సంవత్సరానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన మేరకు పరకాల లోని జిఎం రెడ్డి కాటన్ ఇండస్ట్రీస్, ధనలక్ష్మి కాటన్ మిల్, ఆత్మకూరులోని శ్రీ హనుమాన్ కాటన్ ఇండస్ట్రీస్, వరంగల్ లోని శ్రీకృష్ణ కాటేక్స్  జిన్నింగ్ మిల్లు ద్వారా పత్తిని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. పత్తిలో 8 శాతం  ఉన్నట్లయితే రూ. 8110, 9 శాతం తేమ ఉంటే రూ. 8029, 10 శాతం తేమ ఉంటే రూ. 7948, 11 శాతం తేమ ఉన్నట్లయితే రూ. 7867, 12 శాతం తేమ  ఉన్న పత్తికి రూ. 7786 చెల్లిస్తారని తెలిపారు. జిల్లాలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యమైన పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ రైతులకు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .