మహిళ సంఘాల భూమిని కాపాడండి.

హనుమకొండ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా.

మహిళ సంఘాల భూమిని కాపాడండి.

 భూ కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

హాసన్ పర్తి,నవంబర్ 10(తెలంగాణ ముచ్చట్లు):

 హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మునిగిపల్లి గ్రామైక్య డ్వాక్రా సభ్యులకు భూములను రక్షించాలని సోమవారం రోజున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ నాయక్,మునిపల్లె కాంగ్రస్ గ్రామ అధ్యక్షుడు నదునూరి కిషన్ మాట్లాడుతూ 2004వ సంవత్సరంలో  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చింతగట్టు రెవెన్యూ గ్రామ శివారు సర్వేనెంబర్ 120బి,120 సి/1 లలో 12 ఎకరాల 30 గుంటల భూమిని కేటాయించడం జరిగిందని అప్పటి ఎంఆర్ఓ సర్వే చేసి హద్దులు వేయడం జరిగిందని అదేవిధంగా డి ఆర్ డి ఏ ద్వారా మోటరు కరెంటు పోల్స్  వేసి ఆ భూమిలో ఉన్న చెట్లను కొట్టివేసి చదును చేసుకుని పంటలు పండిస్తూ  గత 20 సంవత్సరాల నుండి కాస్తులో ఉంటున్నామని గత పది రోజుల క్రితం చింతగట్టుకు చెందిన నద్దుWhatsApp Image 2025-11-10 at 6.33.35 PMనూరి నాగరాజు గ్రామ్యక్య సభ్యుల భూమిలో ఉన్నటువంటి మోటారు కరెంటు స్తంభం ధ్వసం చేసి భూమి చుట్టూ ఫెంషింగ్ వేసి అందులో ఉన్నటువంటి మట్టిని అమ్ముకుంటున్నారాని మహిళా సంఘాలకు కేటాయించిన భూమిని కబ్జాకు పాల్పడుతున్న నాగరాజు పై క్రిమినల్ కేసు నమోదు చేసి మహిళా సంఘాల సభ్యులకు పట్టా పాస్ బుక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల సభ్యులు నదునూరి సరోజన,స్వప్న సులోచన,ఐలమ్మ,స్వరూప,సంధ్య,యమునా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .