పీఆర్టీయూ టీఎస్ నూతన 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండలంలో పీఆర్టీయూ టీఎస్ నూతన 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మండల విద్యావనరుల కేంద్రం, ధర్మసాగర్ బాలికల హైస్కూల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షుడు అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి జాన్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ముఖ్య అతిథులుగా హాజరైన ధర్మసాగర్ మండల విద్యాధికారి రాంధన్, వేలేరు మండల విద్యాధికారి చంద్రమౌళి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మురళి ప్రసంగిస్తూ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదవ తరగతి ఫలితాల్లో మండలం జిల్లాలో ప్రథమ స్థానం సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.మండల అధ్యక్షుడు అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండి పనిచేస్తోందని, బకాయిల చెల్లింపుల విషయంలో కృషి చేస్తున్నట్టు వివరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు రఘోత్తం రెడ్డి, బండ రమేష్, కేశవ రెడ్డి, కుమారస్వామి, శర్మ, శ్రీకాంత్ రెడ్డి, నరేష్ కుమార్, తులసి, యమునశ్రీ, రమాదేవి, సరస్వతిదేవి, మాధవి తదితరులు పాల్గొన్నారు.


Comments