మృతుల కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆదరణ
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
ఏదులాపురం మున్సిపాలిటీ :ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవడం ఒక నిజమైన ప్రజానాయకుడి లక్షణమని మరోసారి చాటారు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఆయన సూచనల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.
ఇటీవల పలు కారణాలతో మృతిచెందిన కుటుంబాలకు తోడుగా నిలుస్తూ బుధవారం జరిగిన కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని టెంపుల్ సిటీ, వరంగల్ క్రాస్ రోడ్డు, వెంకటగిరి, గుదిమళ్ళ, తెల్దారుపల్లి, మద్దులపల్లి, ఏదులాపురం, ముత్తగూడెం, నాయుడుపేట ప్రాంతాల నుంచి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందించారు.
ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... “ప్రజా సమస్యలతో పాటు వారి వ్యక్తిగత దుఃఖ సమయంలోనూ ప్రజలతో నిలబడటం పొంగులేటి ప్రత్యేకత అని, ఆయన ప్రేరణతో పీఎస్ఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఈ సాయం తమకు తాత్కాలికంగా ఓదార్పునిచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments