ప్రజావాణి దరఖాస్తుల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
-- వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఇప్పటికిప్పుడు పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఐడిఓసి ప్రజావాణి హాల్లో వనపర్తి జిల్లా అదనపు లోకల్ బాడీస్ కలెక్టర్ సంచిత్ గంగు వార్, మరియు వనపర్తి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ ఎం. నాగేష్ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. నేడు71 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రసంగిస్తూ వివిధ శాఖల అధికారులు ప్రజావాణి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటం పై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారునికి. సమాచారం ఇవ్వాలని సూచించారు. చిత్రంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. వనపర్తి జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగు వార్. వనపర్తి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ ఎం. నాగేష్. వనపర్తి జిల్లా మీడియా పౌర సమాచార అధికారి సీతారాం నాయక్. కలెక్టర్ సిసి శ్రీకాంత్. అదునపు రెవిన్యూ కలెక్టర్ సిసి రహీం ఉన్నారు.


Comments