స్వచ్ఛత అనేది ఒక నిరంతర ప్రక్రియ 

స్వచ్ఛత ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేస్తుంది 

స్వచ్ఛత అనేది ఒక నిరంతర ప్రక్రియ 

 డిఆర్డిఓ మేన శ్రీనివాస్  

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం మరియు హ్యూమన్ రైట్ డే సందర్భంగా నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా, హనుమకొండ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

IMG-20241210-WA0018మంగళవారం జరిగిన కార్యక్రమంలో 100% మరుగుదొడ్లను వినియోగిస్తున్న లబ్ధిదారులను గుర్తించి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ మేన శ్రీను మాట్లాడుతూ, స్వచ్ఛత ఒక నిరంతర ప్రక్రియ అని, ప్రజలు మరుగుదొడ్లను పూర్తిగా వినియోగించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్త విభజనపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.

ఆయన మాట్లాడుతూ, హనుమకొండ జిల్లాను స్వచ్ఛత వైపు ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇది ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేస్తుందని ఆయన వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ ముఖ్యతను ప్రజల్లోకి చొప్పించడం, మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ, ఏఓ, కార్యాలయ సూపరింటెండెంట్‌లు స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్లు,సిబ్బంది, లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .