జెకె కాలనీలో ఆర్‌సీసీ పైప్‌లైన్ పనులు త్వరలో ప్రారంభం.
కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పర్యటన
మల్కాజిగిరి, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని జెకె కాలనీలో కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి గురువారం పర్యటించారు. కాలనీ పరిస్థితులను స్వయంగా పరిశీలించి, స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “జెకె కాలనీలో ప్రతి వర్షాకాలం సమయంలో డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలసి రోడ్లలోకి, ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఎన్నేళ్లుగా స్థానికులు మన ముందు ఉంచుతున్నారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి రూ.80 లక్షల వ్యయంతో ఆర్‌సీసీ పైప్‌లైన్ పనులు చేపడుతున్నాం” అని తెలిపారు. కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, “ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు వేగంగా ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ పనులు పూర్తయ్యాక కాలనీ నీటమునిగే పరిస్థితి ఉండదు. కాలనీ ప్రజలు సౌకర్యంగా జీవించేందుకు మున్సిపల్ శాఖ పూర్తి సహకారం అందిస్తుంది” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డీఈ లౌక్య, ఏఈ నవీన్, సూపర్‌వైజర్లు సాగర్, వెంకటేష్, బీజేపీ నాయకులు సాయి సురేష్, జగదీష్ చారి, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు కార్పొరేటర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తమ సమస్యలను పరిష్కరించేందుకు చూపుతున్న కృషిని అభినందించారు.


Comments