వనపర్తి వృద్ధాశ్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ పెళ్లిరోజు వేడుకలు
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి పట్టణంలో ని నందనవనం వృద్ధాశ్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ పెళ్లిరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెద్దమందడి మండలం మద్దిగట్ల - మోజర్ల జడ్పిహెచ్ఎస్ 1997-98 టెన్త్ క్లాస్ బ్యాచ్ స్నేహితులతో కలిసి రిటైర్డ్ ఆర్మీ జవాన్ రాజేశ్వర్ రెడ్డి పద్మ ల 23 పెళ్లిరోజు వేడుకలు వనపర్తి పట్టణంలోని వల్లబ్ నగర్ నందనవనం వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల రిటైర్డ్ హిందీ పండిత్ పాపన్నను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్నేహితులతో కలిసి తమవంతుగా సమాజంలో సేవా దృక్పథంతో సమాజ సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే వృద్ధాశ్రమనికి వచ్చి స్నేహితులతో వేడుకలు జరుపుకున్న సంతోషంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఇక్కడికి వచ్చి వృద్ధాశ్రమం లో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
అనంతరం వృద్ధాశ్రమానికి 20 వేల వంట సామాగ్రిని స్నేహితులతో కలిసి అందజేశారు. అశ్రమంలో ఉంటున్న 16 మంది సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. సమాజంలో వృద్ధుల పట్ల ప్రేమ ఆప్యాయతతో మెలగాలి అని సూచించారు.


Comments