ముమ్మరంగా కొనసాగుతున్న రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు
Views: 98
On
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండల పరిధిలోని జగత్ పల్లి శివారులో ప్రధాన రహదారిపై ప్యాచ్ వర్క్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పెద్దమందడి మండల కేంద్రం నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారిలో జగత్ పల్లి నుంచి రాజనగరం రామకృష్ణేశ్వర దేవాలయం వరకు గత కొన్ని రోజులుగా రోడ్డు గుంతలు ఏర్పడి ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడింది. దీంతో జగత్ పల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టు పని దక్కించుకొని సుమారు పది లక్షల వ్యయంతో రోడ్డు పనులను ప్రారంభించారు. ఎన్నో రోజులుగా గుంతల రోడ్డుతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు తాత్కాలిక ప్యాచ్ రోడ్డు పనులతో ఉపశమనం కలగనుందని మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments