ఆట పాటలతో ఆర్టీసీ ఉద్యోగుల కోలాహాలం
ఘనంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల 2వ రోజు కార్తీకమాస వనబోజన మహోత్సవం
వనభోజన మహోత్సవం డిపో మేనేజర్ గా చిరకాల గుర్తింపు
--- ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
అత్యవసర సేవలు అందించే ఆర్టీసీ ఉద్యోగులందరూ కుటుంబ సమేతంగా ఒకచోట చేరి ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. సతీసమేతంగా ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహాలంగా రెండు రోజులపాటు గడపటం చిరస్మరణీయమని ఆర్టీసీ ఉద్యోగులు పలకరించుకోవడం గమనార్హం. బుధవారం ఖమ్మం డిపోలో డిపో మేనేజర్ దినేష్ కుమార్ అధ్యక్షతన రెండవ రోజు కార్తీకమాస వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ఖమ్మం డిపో మేనేజర్ గా పనిచేయడం చిరకాలం గుర్తుండిపోయే అనుభూతిని కల్పించిందని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ ఇదేవిధంగా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి సంక్షేమాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. తమ సంస్థ ఎండి సజ్జనార్ ఉద్యోగులందరికీ వనమహోత్సవ కార్యక్రమానికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషకరమని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) రామయ్య, అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) ప్రవీణ్ కుమార్, 300 మంది ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టిసి పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కంచె భాస్కర్, కానిస్టేబుల్ ఉష తదితరులు పాల్గొన్నారు.


Comments