మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకులు

మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకులు

పెద్దమందడి,డిసెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన కాసింగారి చంద్రయ్య భార్య కాసింగారి వెంకటమ్మ  ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. వెంకటయ్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మరియు బీఆర్‌ఎస్ నాయకులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, మృతురాలి కుటుంబానికి రూ.5,000/- (ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే భవిష్యత్తులో కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తమవంతు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు.
విషాద సమయంలో అండగా నిలిచిన సర్పంచ్ మరియు బీఆర్‌ఎస్ నాయకుల మానవీయతను గ్రామస్తులు అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .