జే ఈ ఈ మాట్ కు అర్హత సాధించిన షేక్ అజీమ్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్ లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు 2025 జే ఈ ఈ మెయిన్స్ పరీక్షల్లో జే ఈ ఈ మాట్ కు అర్హత సాధించినట్లు తెలంగాణా మైనారిటీ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల సెక్రటరీ మొహమ్మద్ ఫహిముద్దీన్ ఖురేషి ఒక ప్రకటన లొ తెలియచేసారు జేఈఈ మెయిన్స్‌లో బార్కస్ విద్యార్థులు అత్యధికంగా 98.4 శాతం మార్కులు సాధించారు తెలంగాణా రెసిడెన్షియల్ కళాశాల లొ మైనారిటీ విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వం ఐఐటి మరియు జేఈఈ మెయిన్స్ కు ఉచిత ట్యూషన్ అందించి విద్యార్థుల ఉజవ్వలభవిషత్తు దోహదం చేస్తుందని, రాబోయే రోజుల్లో మైనారిటీ విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వం అండగా ఉంటుందని అర్హత సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు తెలంగాణా రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల సెక్రటరీ మొహమ్మద్ ఫహిముద్దీన్ ఖురేషి బార్కస్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు అదేవిదంగా కళాశాల అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ఈ విషయం పట్ల షేక్ అజీమ్ తల్లీ తండ్రులు మరియు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు


Comments