ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి 

హన్మకొండ,సెప్టెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రణాళిక ప్రకారం ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఎన్నికల సంఘం కార్యాలయం నుండి అదనపు సీఈఓ లోకేష్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్ నిర్వహణకు ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్‌ఐఆర్ డేటాను 2025 ఎస్‌ఎస్‌ఆర్ డేటాతో పోల్చుకోవాలని సూచించారు. ఈ రెండు జాబితాలలో కామన్‌గా ఉన్న పేర్లు మినహా చేసి, 2002 తర్వాత ఓటర్లుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని తెలిపారు.

ఎస్‌ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల ఎస్‌ఐఆర్ విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తుచేశారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, బిఎల్ఓలు, సూపర్వైజర్లతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజూ స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని, కార్యాచరణ ప్రకారం ఎస్‌ఐఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కే. నారాయణతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .