30 లక్షలతో నూతన డ్రైనేజీ పనులు ప్రారంభం
చర్లపల్లి, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్ చక్రిపురం కాలనీలో గత కొంతకాలంగా ప్రజలుఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు రూ.30 లక్షల వ్యయంతో నూతన డ్రైనేజీ లైన్ పనులు ప్రారంభమయ్యాయి.కాలనీలోని మురుగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు పలుమార్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని కలసి సమస్యను వివరించగా, ఆయన వెంటనే స్పందించి వాటర్ వర్క్స్ శాఖాధికారుల తో చర్చించి నిధులు మంజూరు చేయించారు.సోమవారం ఉదయం పనులను ప్రారంభించిన అనంతరం స్థానిక ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేమూరీ మహేష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు మొగలి రావు రెడ్డి, కాలనీ అధ్యక్షుడు గడ్డల పాండు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సోమస్వామి అశోక్, ఉపాధ్యక్షులు కొండారెడ్డి, నాయకులు సహదేవ గౌడ్, వినోద్, నాయి శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. చక్రిపురం కాలనీలో ప్రారంభమైన ఈ పనులతో కాలనీ వాసులకు చాలా ఉపశమనం లభిస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.


Comments