యతి నర్సింగానంద్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి
ఖమ్మం జిల్లా జమియత్ ఉలమా
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
‘’మొహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసి ముస్లింల మనోభావాలను దెబ్బ తీసిన యతి నర్సింగానంద్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ’’ జామియత్ ఉలమా.’’ ఖమ్మం జిల్లా జమియత్ ఉలమా ఆధ్వర్యం లో జిల్లా అధ్యక్షుడు
మౌలానా సయీద్ అహ్మద్ ఖాస్మీ, జిల్లా కాంగ్రేస్ నాయకులు అబ్దుల్ రషీద్ మరియు జిల్లా ముఖ్య ఉలమాల తో కలిసి ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ కి కలిసి వినతిపత్రం ఇచ్చారు
భారత దేశ లౌకిక వ్యవస్థను భిన్నత్వంలో ఏకత్వం అనే ఔనిత్యాన్ని మత సామరస్యాన్ని, శాంతి వాతావరణాన్ని భగ్నం చేస్తున్నారని విమర్శించారు ఇస్లాం శాంతియుత మతం అని వివరిస్తూ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మతోన్మథుడు యతి నర్సింగానంద్ పై కఠినమైన సెక్షన్లు ను పెట్టి భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. కమీషనర్ సునీల్ దత్ సానుకూలంగా స్పందించి భారతదేశం కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని సూచించారు భారత రాజ్యాంగం యొక్క నిజమైన విశ్వాసం ప్రతి కులము మతము వారియొక్క విశ్వాసాలను భంగం కలిగించరాదని పేర్కొన్నారు మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్ పై చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఆయన చెప్పారు. జమియత్ ఉలమాలు కులమతాలకు గౌరవిస్తూ అన్ని మతాల వారికి వారియొక్క సంప్రదాయాలకు అనుగుణంగా సూచనలు చేస్తూ అందరినీ కలుపుకొని ముందు కెళుతున్న మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ జలాలుద్దీన్, ఖత్మే నబువ్వత్ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ సత్తార్, ప్రభుత్వ ఖాజీ ముఫ్తీ ఆసిఫ్, మౌలానా హిమాయతుల్లా, మజ్లిసే ఇల్మియా నజీమ్ మౌలానా సల్మాన్, మౌలానా అబ్దుల్ ఘనీ , మౌలానా ఆరిఫ్ , ముఫ్తీ అబ్దుల్ ఖలీఖ్, మౌలానా సాబీర్, ముఫ్తీ ఇమ్రాన్, ముఫ్తీ సల్మాన్, ముఫ్తీ రౌఫ్, ముఫ్తీ, రిజ్వాన్ తదితర ముఖ్య ఉలమాలు పాలుగొన్నారు


Comments