ఆగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే
ఖిల్లా ఘనపూర్ ఎంపీడీవో వెంకటాచారి
వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:
ఖిల్ల ఘనపూర్ మండలం ఎంపీడీవో వెంకటాచార్య ఆధ్వర్యంలో ఆగరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులను గుర్తించి వివరాలను పరిశీలించారు. అధికారులతో కలిసి మండల కాంగ్రెస్ నాయకులు మున్నూరు జయకర్ పాల్గొని లబ్ధిదారులు ఉంటున్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు మున్నూరు జయకర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించి అర్హులని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షలు అందజేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రజల నుండి వివరాలు నమోదు చేస్తున్నారని తెలిపారు. పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇల్లు అని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటాచారి, గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్, మండల కాంగ్రెస్ నాయకులు మున్నూరు జయకర్, బాలు, రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


Comments