గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)ఉద్యోగాల ఎంపికలో   తెలంగాణ అభ్యర్థులకు న్యాయం చేయాలి

 పదో తరగతిలో  గ్రేడ్ పాయింట్ల కారణంగా..  ఎంపికల్లో అన్యాయం జరుగుతోంది  

గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)ఉద్యోగాల ఎంపికలో   తెలంగాణ అభ్యర్థులకు న్యాయం చేయాలి

* పున: పరిశీలన చేయాలని 
 ఢిల్లీలో పోస్టల్ శాఖ కార్యదర్శి కి విన్నవించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్  (జీడీఎస్) పోస్టల్ శాఖ ఉద్యోగాలకు 95శాతo తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులనే ఎంపిక చేయాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. ఈ మేరకు  ఢిల్లీలో పోస్టల్ శాఖ  కార్యదర్శి వందిత కౌల్ కు బుధవారం ఢిల్లీలోని పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పదవ తరగతిలో  గ్రేడ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. 
తెలంగాణ (సర్కిల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి.. అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. స్థానికంగా తెలుగు చదివినవారు అర్హులని, గ్రేడింగ్ విధానం వల్ల తపాలా శాఖ  ఎంపికల్లో..  తెలంగాణ వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని  తెలిపారు. పదో తరగతిలో గ్రేడింగ్ కాకుండా.. మార్కులు ఇస్తున్న ఇతర రాష్ట్రాల వారికి ఆ పోస్టులు దక్కుతున్నాయని, గత ఎంపికల్లో ఇలానే జరిగిందని వివరించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో.. 747 మంది తెలంగానేతరులు ఎంపికయ్యారని తెలిపారు. పున: పరిశీలన చేసి.. మా తెలంగాణ రాష్ట్రంలోని అర్హులందరికీ 95శాతం తపాల శాఖలో ఉద్యోగ అవకాశాలు లభించేలా చూడాలని ఈ సందర్భంగా విన్నవించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .