జిల్లాలో అందించిన సేవలకు ధన్యవాదాలు...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
–జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం సిబ్బంది
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్-30, తెలంగాణ ముచ్చట్లు:
ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది జిల్లాలో అందించిన సేవలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ధన్యవాదాలు తెలిపారు.
ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం జిల్లాలో 3 నెలలుగా సేవలు అందించి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కలెక్టరేట్ లోని వారి ఛాంబర్ లో కలిసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్.డి.ఆర్. ఎఫ్. సిబ్బంది జిల్లాలో మూడు నెలల పాటు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. మూడు నెలల పాటు జిల్లాలో ఉండడంతో జిల్లా యంత్రాంగం ధైర్యంగా ఉందని, భారీ వర్షాలు సందర్భంగా చింతకానిలో వరద సమయంలో నదిలో చిక్కుకున్న సంఘటన సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడం జరిగిందని, అంతేకాకుండా ఎస్డిఆర్ఎఫ్ బృందం, ఆపద మిత్రులకు శిక్షణ అందించి ఆపద సమయంలో తీసుకోవాల్సిన మెళకువలు అందించి నిష్ణాతులు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments