ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
మందముల పరమేశ్వర్ రెడ్డి
మల్లాపూర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఎండి. మిస్బా అనారోగ్యంతో బాధపడుతుండగా బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్, బాధితురాలి చికిత్స ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి పథకానికి దరఖాస్తు చేశారు.దీని ఆధారంగా సీఎం సహాయనిధి కింద గతంలో రూ.5 లక్షలు, తాజాగా మరో రూ.3 లక్షలు ఎల్‌ఓసి రూపంలో మంజూరయ్యాయి. ఈ నిధులను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి బుధవారం రోజున మిస్బా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పేదల వైద్య అవసరాలకు సీఎం సహాయనిధి ఆశీర్వాదంగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్, తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, పి.ఎస్.ఎన్. చౌదరి తదితరులు పాల్గొన్నారు.


Comments