పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 

చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన ఎంపీ కావ్య

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 

చాకలి ఐలమ్మ స్ఫూర్తి ప్రదాత

వరంగల్, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్థానిక శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి హంటర్ రోడ్, న్యూ శాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, “చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు. ఆమె అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ధైర్యాన్ని, పోరాట పటిమను దేశానికి, ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమె చూపినబాటలో నడుస్తూ తెలంగాణ మహిళలను శక్తివంతులను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.WhatsApp Image 2025-09-26 at 7.50.44 PM

తరువాత మాచిదేవ ట్రస్ట్ భవన్‌ను ఎంపీ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి కూడా పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పలువురు గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, హనుమకొండ, వరంగల్ అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి, సంధ్యారాణి, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, సత్యపాల్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .