నాచారంలో కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి,

నాచారంలో కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

నాచారం, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

నాచారం డివిజన్ పరిధిలో కోటి రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ లు శంకుస్థాపన చేశారు.ఈఎస్ఐ హాస్పిటల్ లోపల ఉన్న ఓపెన్ నాలా పూడికతో డ్రైనేజీ నీరు రోడ్లపైకి ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.90 లక్షల వ్యయంతో భారీ వర్షపు నీటి డ్రైనేజీ నిర్మాణం చేపట్టబడింది.అలాగే అన్నపూర్ణ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ ఎం. రమేష్ బాబు, నాచారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రామ్‌రెడ్డి నగర్ మరియు అన్నపూర్ణ కాలనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .