ఏజెన్సీ ప్రాంతంలో గవర్నర్ పాలన కొనసాగించాలి

జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి

ఏజెన్సీ ప్రాంతంలో గవర్నర్ పాలన కొనసాగించాలి

తెలంగాణ ముచ్చట్లు(నూగురు):

ఏజెన్సీ చట్టాల పరిరక్షణకై ప్రభుత్వం చొరవ చూపాలి...

ఏజెన్సీ ప్రాంతానికి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి...

1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి....

 వెంకటాపురం ములుగు జిల్లా మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన కమ్మరిగూడెం గ్రామంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.గ్రామ యూత్ అధ్యక్షులు పర్శిక అనిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి పాల్గొని మాట్లాడుతూ.5,6 షెడ్యూల్ ప్రాంతాన్ని గవర్నర్ పాలన కొనసాగించాలి అన్నారు. షెడ్యూల్ భూభాగం అంతటిని పరిపాలించే అధికారం ఒక గవర్నర్ కు మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.5వ షెడ్యూలు భూభాగంలో 1/70 చట్టానికి విరుద్ధంగా వలస నిరోధక చట్టాలు ఉన్నప్పటికీ,గిరిజనేతరులు షెడ్యూల్ భూభాగంలోకి విచ్చలవిడిగా వస్తున్నారని యద్దేవ చేశారు.ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తూ,రియల్ ఎస్టేట్ వ్యాపారాలుబిసిేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్న ఏ అధికారి కూడా స్పందించకపోవడం చాలా దుర్మార్గం అని ఆయన అన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆదివాసులు జీవనం కోసం కొంత భూమిలో గుడిసెలు నిర్మించుకొని జీవనం కొనసాగించాలనుకుంటే అధికారులు మాత్రం వాటిని అక్రమ నిర్మాణాలంటూ వాటిని తొలగిస్తున్నారు కానీ గిరిజన నేతలు అక్రమంగా నిర్మాణాలు అక్రమ నిర్మాణాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. గిరిజన నేతలు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ వాటిలో నిర్మాణాలు చేస్తున్న వాటిపై ఇంతవరకు ఎన్టీఆర్ కేసులు నమోదు చేయకుండా చేయకుండా ఆకాశం వైపు దిక్కులు చూస్తున్నారు తప్ప ఏమాత్రం చర్యలు తీసుకోవడంలేదని అన్నారు1/70 చట్టాన్ని నిర్వీర్యం చేయటంలో అధికారులే పెద్ద పాత్ర పోషిస్తున్నారని హేతువ పలికారు.ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఆదివాసి చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ఏ ముఖ్యమంత్రి చొరవ చూపడం లేదని ఆయన మండిపడ్డారు.కోనేరు రంగారావు గారి శ్రీకృష్ణ సిఫారసు కమిటీ చెబుతున్న ఆదేశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని డిమాండ్ చేశారు.శ్రీకృష్ణ సిఫారసు కమిటీ 2002లో ఆదివాసీలు అడవిని భూమిని నీటిని నమ్ముకొని ఉన్నారని.వారి పై ఎటువంటి దాడులు చేయవద్దని వాళ్ల భూములను ప్రభుత్వం లాక్కోవద్దని చెబుతుందని మరోసారి గుర్తుచేశారు. షెడ్యూలు ప్రాంతాలను గవర్నర్ పరిపాలన కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.వెంకటాపురం మండల కేంద్రంలో గతంలో ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్ విపి గౌతమ్ కొంత ప్రభుత్వ భూములను గుర్తించి వాటికి దిమ్మలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు అలా గుర్తించిన భూములు ఇప్పుడు గిరిజనేతరుల కబంధ హస్తాల్లోకి చేరాయని, గతంలో ఐఏఎస్ ఆఫీసర్ దిమ్మలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ భూముల పై సమగ్ర విచారణ నిర్వహించి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసులు పూనేం అర్జున్,రమేష్,కాశీనాథ్, పర్షిక బాబురావు,పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .