మంత్రి అడ్లూరి ని కలిసిన మాదిగ జర్నలిస్ట్ ఫోరం బృందం

అక్రిడిటేషన్ కమిటీ, ఎస్సీ కమిషన్ లో భాగస్వామ్యం కై విజ్ఞప్తి

మంత్రి అడ్లూరి ని కలిసిన మాదిగ జర్నలిస్ట్ ఫోరం బృందం

 హైదరాబాద్,ఆగస్టు21(తెలంగాణ ముచ్చట్లు):

 తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గురువారం హైదరాబాదులోని సచివాలయంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు పోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధుల బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా మాదిగ,అనుబంధ కులాల జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. వృత్తి నిర్వహణలో జర్నలిస్టులకు దాడులు, బెదిరింపులు నిత్య కృత్యమవుతున్న నేపథ్యంలో  బాధితుల్లో భరోస నింపేందుకు, దాడుల ఘటనలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు ఎస్సీ కమిషన్ కమిటీ సభ్యులుగా భాగస్వామ్యం కల్పించడంతోపాటు లో మాదిగ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కమిటీలో  అవకాశం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .