వైద్య సమస్యపై అసెంబ్లీలో చర్చించాలి
ప్రభుత్వ ఆస్పటల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలి
పి.వై.ఎల్, పి.ఓ.డబ్ల్యు ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం ప్రజలకు అందడం లేదని, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడి తీవ్ర స్థాయికి పెరిగిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) పూర్వా ప్రస్తుత ప్రధాన కార్యదర్శిలు చండ్ర అరుణ, ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి రాకేష్ లు డిమాండ్ చేశారు. వైద్య సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని కోరుతూ శుక్రవారం పి ఓ డబ్ల్యు పి వై ఎల్ భద్రాది కొత్తగూడెం ,ఖమ్మం జిల్లా ఉమ్మడి కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
నవంబర్ 15 నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో సర్వే నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ హాస్పిటల్స్ సమస్యలకి నిలయాలుగా మారాయని వారు అన్నారు. డాక్టర్ల, నర్సులు, పారామెడికల్ టెక్నీషియన్స్ కొరత తీవ్రంగా ఉందని వారు అన్నారు. మందులు అరకొర ఇచ్చి, మిగతా మందులు ప్రైవేట్ మెడికల్ షాపులో కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ మెడికల్ షాపుల దందా కొనసాగుతుందని, మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వట్లేదు అని అన్నారు. ఇన్ పేషంట్లకి పెట్టే భోజనం నాణ్యత లేదన్నారు. అన్ని రకాల టెస్టులు చేయకపోవడం మూలంగా, బయట డబ్బులతో టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
అలాగే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పటల్ దోపిడి తీవ్ర స్థాయిలో ఉందన్నారు. చిన్న రోగంతో హాస్పిటల్ వెళ్తే, లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారు. మందుల బిల్లులకి అడ్డు అదుపు లేదనీ, పిఆర్వోల విధానంతో హాస్పిటల్ కి పేషెంట్లను తరలిస్తూ అధిక బిల్లులు వేస్తున్నారన్నారు. వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేదని, దీనితో ఇస్టారాజ్యంగా బిల్లులు వేస్తున్నారని అన్నారు. ఈ దోపిడిపై ప్రభుత్వ ఆస్పటల్ బలోపేతంపై అసెంబ్లీలో చర్చించి, దోపిడిని అరికట్టేందుకు ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెర్చల కల్పన కోశాధికారి ఝాన్సీ జిల్లా కార్యదర్శి ఆవుల మంగతాయి సహాయ కార్యదర్శి ప్రతాపనేని శోభ పి వై ఎల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జాటోత్ ప్రేమ్ సింగ్ దేవా జిల్లా నాయకులు డి చందు మామిడాల వెంకటేష్ శివ లాల్ పాల్గొన్నారు.


Comments