ఏసు ప్రభువు బోధించిన బోధనలు భావితరాలకు అందించాలి
క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క
-ములుగు జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ములుగు,తెలంగాణ ముచ్చట్లు:
ములుగు జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓలి మినీ స్ట్రీట్ చర్చిలో మరియు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన వేడుకలకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి, రాష్ట్ర ప్రజలకుక్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ, “ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వం అందించే విలువలను ప్రతిపాదిస్తాయి. స్వార్థరహిత జీవనం, ప్రేమ, క్షమ, దయ, మరియు జ్ఞానాన్ని పంచుకోవడం వంటి బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరం అని అన్నారు . ఈ బోధనలను భావితరాలకు చేరవేసే బాధ్యత మనందరి మీద ఉంది” అని పేర్కొన్నారు.శాంతి, ప్రేమ సందేశాలతో వేడుకలు క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కీర్తనలు నిర్వహించబడ్డాయి. మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments