పేరుకే పల్లె దావఖాన అక్కడ డాక్టర్లు ఉండరు.
పల్లె దవఖాన డాక్టర్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పల్లె ప్రజలు..!!
టేక్మాల్ ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పల్లె దావఖానాలో పేద ప్రజలకు ఆరోగ్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనేక సదుపాయాలు మందులు సరఫరా చేసి పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ప్రభుత్వం 2021 లో పల్లె దవాఖానాలు నిర్మిస్తూ వాటికి తగిన సిబ్బందిని నియమిస్తూ ప్రజలకు అవసరమైన సదుపాయాలు మందులను అందిస్తున్నది కానీ పల్లె దవఖాన డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుందిని చెప్పవచ్చు. అవసరమైన సదుపాయాలు మందులు అందుబాటులో ఉంచి పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూర్చింది. పల్లె దావఖానలో డ్యూటీ డాక్టర్లు వారంలో రెండుసార్లు మాత్రమే పల్లె దవాఖానకు చూట్టపు చూపుగా వస్తూ తమ విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారు, మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలో బుధవారం సూరంపల్లి, ఎల్పుగొండ, ఎల్లకుర్తి, పాల్వంచ, పల్లె దవాఖానకు తాళం వేసి దర్శనమిస్తున్నాయి. గ్రామాలలో పల్లె దవాఖానా డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పల్లె దవాఖానా వద్ద డాక్టర్ల కోసం పడిగాపులు గాసి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నమని తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోగులు మండిపడుతున్నారు. డ్యూటీ డాక్టర్లు పల్లె దవాఖానలకు రాక గ్రామీణ ప్రాంత రోగులకు సరైన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనితో వైద్య పరీక్షలు, ప్రాథమికంగా మందుల సరఫరా, గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు పిల్లలకు టీకా కార్యక్రమాలు, ఆరోగ్య పరీక్షలు, నివారణ సౌకర్యాలు వంటి సదుపాయాలకు, ఇబ్బందిగా మారి ఆయా గ్రామాల రోగులకు సరైన వైద్యం అందించడంలో జాప్యం ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో పలు మార్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పల్లె దవాఖానా డ్యూటీ డాక్టర్లు పనితీరులో మాత్రం మార్పు రావడంలేదు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పల్లె దవఖాన డ్యూటీ డాక్టర్ల పై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా చూడాలని స్థానిక ప్రజలు నాయకులు కోరుతున్నారు.


Comments