ఇందిరమ్మ కమిటీల నియామకాల్లో పారదర్శకత పాటించాలి
హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు
భారత రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి హసన్ పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని హసన్ పర్తి ఎంపీడీవో కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సంధర్బంగా భారత రాష్ట్ర సమితి హసన్ పర్తి మండల అధ్యక్షుడు బండి రజని కుమార్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల నియామకాల కోసం జీవో నెంబర్ 33 ప్రకారం ప్రతి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగా అర్హులైన అందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ కమిటీల నియామకాలు చేపట్టాలని ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, కందుకూరి చంద్రమోహన్, చాతల్ల వేణుగోపాల్,నద్దునూరి నాగరాజ్ జెట్టి, రాజేందర్, శరత్ ,భగవాన్ రెడ్డి, కొయ్యడ గోపి, ఇల్లందుల గణేష్, మూల దేవేందర్, బిల్లా రఘు, రాజేష్, వెలిసోజ్ రవి, ప్రశాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments