వైరా  క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో 

వైరా  క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో 

ప్రముఖ కవి అందెశ్రీ కి
 ఘన నివాళి...

ఖమ్మం బ్యూరో ,నవంబర్ 10, తెలంగాణ ముచ్చట్లు;

వైరా స్థానిక క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి అందెశ్రీ కి సంతాపం తెలియజేశారు.
 ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి విద్యాసంస్థలు చైర్మన్ వాసిరెడ్డి సునీత కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను జాగృతి పరచడంలో అందెశ్రీ కీలకపాత్ర వహించారని తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక గేయాలను రచించి ప్రజలలో చైతన్యాన్ని నింపి తెలంగాణ సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేశారని అన్నారు.. ఆయన రచించిన జయ జయహే తెలంగాణ మరియు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే రచనలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ సంయోగిత ఎన్ఎస్ఎస్ 
 పి ఓ లింగారావు, అధ్యాపకులు మజీదు, వేణు, చైతన్య,రామకృష్ణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు...

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .