జిహెచ్ఎంసి కమిషనర్‌ను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 

జిహెచ్ఎంసి కమిషనర్‌ను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 

చర్లపల్లి, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గంలో వర్షాకాలంలో తరచూ ముంపు సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, శ్రీనగర్ మరియు కృష్ణారెడ్డి నగర్ కాలనీల్లో 550 మీటర్ల పొడవున స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ఏర్పాటు అవసరాన్ని వివరించారు.కాలనీలలో భారీ వర్షాల వల్ల తరచూ నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన కమిషనర్ రూ. 2 కోట్లు 85 లక్షల నిధులను మంజూరు చేశారు. అదే విధంగా సాయి నగర్ ఆర్చ్ నుండి టీ ఫైర్ వరకు, కృష్ణారెడ్డి నగర్ రోడ్ నం.1 మరియు రోడ్ నం.2 వద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని జోనల్ కమిషనర్‌కు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.తదుపరి చర్చలో, ఇటీవల చర్లపల్లి డివిజన్ పరిధిలో కురిసిన ఎడతెరిపిలేని భారీ వర్షాల వల్ల కాలనీలు ముంపుకు గురికాకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టడం అవసరమని నిర్ణయించారు.ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .