డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నాం...
-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Views: 22
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
వర్షపు నీటితో ఇబ్బందులు తలెత్తకుండ డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మంత్రి నగరంలోని 29వ డివిజన్ ప్రకాష్ నగర్ లో రూ. 95 లక్షల వ్యయంతో నిర్మించనున్న వర్షపు నీటి డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. నిర్మాణ పనులు నాణ్యత తో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు కొప్పెర సరిత ఉపేందర్, మేడారపు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, గజ్జల లక్ష్మి వెంకన్న, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments